2007 లో సాహిత్యనేత్రం వివిధ కేటగరీల్లో నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు గెలుచుకున్న కథలను వెబ్సైట్లో ప్రచురించడం మొదలుపెట్టాం. ముందుగా 2007 (జూలై-సెప్టెంబర్) సంచికలోని సంపాదకీయం, అదే సంచికలో ప్రచురితమైన రెండు కథలు – స్త్రీవాద కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన వి. ప్రతిమ గారి గాలి గంగమ్మ, దానితోబాటే సింగమనేని నారాయణ గారి ఊబి కథకు కీ.శే. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి ఆంగ్లానువాదం The Mire చదవండి.
Archive for September, 2008
గాలి గంగమ్మ, ఊబి ఆంగ్లానువాదం
Tuesday, September 30th, 2008నేత్రం తెరచుకొంది
Monday, September 29th, 2008గతంలో మేం ప్రకటించినట్లుగానే తెలుగులో మొట్టమొదటిసారిగా ఒక సాహిత్య పత్రిక పూర్తి కంటెంటును అంతర్జాలంలో అదీ యూనికోడ్ లో ఉచితంగా అందించే ప్రయత్నం మొదలుపెట్టాం. మా ఈ ప్రయత్నాన్ని సాహిత్యనేత్రం త్రైమాసిక పత్రిక ద్వితీయ కథల పోటీలో వివిధ కేటగరీల్లో బహుమతులందుకున్న కథలతో మొదలుపెడుతున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. ఈ వెబ్సైటును ఎప్పటికప్పుడు సాహిత్యనేత్రం వివిధ సంచికల్లోని రచనలతో తాజాకరిస్తూ ఉంటాం.
సాహిత్యనేత్రం వెబ్సైటులో మేం చేసే అప్డేట్ల గురించి ఈ బ్లాగు ద్వారా ఎప్పటికప్పుడుతెలుపుతూ ఉంటాం. సాహిత్యనేత్రం పాత సంచికల్లో కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, సమీక్షలు, సుప్రసిద్ధులతో చేసిన ఇంటర్వ్యూలు, సాహితీ సమావేశాలకు, సాహిత్యపరమైన విశేషాలకు సంబంధించిన వార్తలు – ఇలా దాదాపు పదహైదు వందల ఫుల్ స్కేప్ పేజీల అమూల్యమైన సాహిత్యం తెలుగులో మా దగ్గర ఉంది. వాటిని నెమ్మదిగా సచిత్రంగా అప్లోడు చెయ్యడం మొదలుపెట్టాం. మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.
ఆర్కైవుల గురించి ఒకమాట: మేం ఈ వెబ్సైటును గత ఏడాదే మొదలుపెట్టినప్పటికీ మా పత్రిక పదేళ్ళ కిందటి నుంచే ఉంది. అందువల్ల సంచికలవారీగా చదువుకోవడానికి వీలుగా ఆర్కైవులు రచనలను అప్లోడు చేసిన తేదీలను బట్టి కాక పత్రిక యొక్క సంచికల తేదీలతో ఏర్పాటుచేశాం. ఈ ఆర్కైవులలో ఎప్పటికప్పుడు కొత్తగా చేర్చే రచనల గురించి ఈ బ్లాగులో ప్రకటిస్తాం.
మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని, మీ సలహాలు, సూచనలను అందిస్తారని ఆశిస్తున్నాం.