Archive for February, 2009

కథ గురించి చలం

Monday, February 23rd, 2009

విశ్వసాహిత్యంలో కథ గురించి చలం రాసిన ఒక వ్యాసాన్ని నేత్రం సేకరించి పునర్ముద్రించింది. వ్యాసనేత్రంలో చదవగలరు.

పెనుగొండ లక్ష్మీనారాయణ నేపథ్యం

Monday, February 23rd, 2009

తెలుగులో కథలకైనా, కవితలకైనా ఆయన కలం ఒక గీటురాయి. ఆయన రచన కథల మాష్టారు కా.రా.గారు శ్రీకాకుళంలో ‘కథానిలయం’ నెలకొల్పడానికి ప్రేరణనిచ్చింది. ఆయన గురించి ఎస్వీ సత్యనారాయణ ఇలా అన్నారు:
”అతడొక అభ్యుదయ సాహిత్యోద్యమ కార్యకర్త
అరుదుగా అద్భుతమైన కవితలల్లే కావ్యకర్త
ఆధునిక కథా సరిత్సాగరంలో
ఆణిముత్యాల నేరుకుంటూ వుంటాడు
అందమైన కవితా పంక్తుల్ని మననం చేస్తూ
అందరికీ పంచుతూ వుంటాడు
అతడొక మౌన కృషీవలుడు.”
ఆయన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర అధ్యక్షుడు  పెనుగొండ లక్ష్మీనారాయణ. ఆయన పడిలేచిన కడలి తరంగం అంటున్నారు కోట పురుషోత్తం నేపథ్యంలో.

శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు

Thursday, February 19th, 2009

“శ్రీరంగం నారాయణబాబుగారి ఒక్కొక్క కవితనూ పరిశీలిస్తూ పోతే అవన్నీ భావచిత్రాల గనులు. క్లుప్తత, సంశ్లిష్టత, గాఢత పెనవేసుకున్న కవితా శిల్పం ఆయనది. అనంతమైన అనుభూతిని, ఆలోచనామృతాన్ని ప్రసాదించేవి. సంవేదనను రగిలించేవి. ‘రుధిరజ్యోతి’ అనే పదబంధం ఆయన కవితల్లో పలుమారు పునరావృతమవుతూ వుంటుంది. ఆయన మనసు పడిన పదబంధం అది. అది విప్లవ తత్వాన్ని సూచించే ఫిరంగిగుండు.” అంటూ శ్రీశ్రీపట్ల సోదరాభిమానంతో
“నీ పాటల కత్తులతోనే
నా హృదయం నెత్తురు తీసి
నే వెలిగించిన ఈ దీపపు కాంతిని
నర్తింపుముర శ్రీ శ్రీశ్రీ!”
అనగలిగిన శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలోని భావచిత్రాలను మనకు చూపిస్తున్నారు డా. పి.సంజీవమ్మ వ్యాసనేత్రంలో.

తస్లీమాపై దాడికి సంబంధించిన కథనాలు

Wednesday, February 4th, 2009

హైదరాబాదులో 2007లో తస్లీమా నస్రీన్ పై జరిగిన దాడికి సంబంధించిన కథనాలు తస్లీమా నస్రీన్‌పై అనాగరిక దాడి, వెరవను.. రచన ఆపను… తస్లీమా నస్రీన్‌, తస్లీమా సంఘీభావ ప్రదర్శన.

వార్తానేత్రంలో

Monday, February 2nd, 2009

2007 లో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన గుర్రం జాషువా 36వ వర్ధంతి విశేషాలు, భమిడిపాటి రాధాకృష్ణ, పాత్రికేయుడు, అనువాద రచయిత సహవాసి ల మృతి గురించి వార్తా నేత్రంలో.

వార్తానేత్రం

Sunday, February 1st, 2009

వార్తానేత్రం‘లో కవిత్వశిల్పి ‘గుంటూరు శేషేంద్ర’, నూతలపాటి కవితా సత్కారం, ‘మనసు కురిసిన ముత్యాలు’ ఆవిష్కరణ సభ, మరికొన్ని విశేషాలు ప్రచురించాం.