శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలో భావచిత్రాలు

“శ్రీరంగం నారాయణబాబుగారి ఒక్కొక్క కవితనూ పరిశీలిస్తూ పోతే అవన్నీ భావచిత్రాల గనులు. క్లుప్తత, సంశ్లిష్టత, గాఢత పెనవేసుకున్న కవితా శిల్పం ఆయనది. అనంతమైన అనుభూతిని, ఆలోచనామృతాన్ని ప్రసాదించేవి. సంవేదనను రగిలించేవి. ‘రుధిరజ్యోతి’ అనే పదబంధం ఆయన కవితల్లో పలుమారు పునరావృతమవుతూ వుంటుంది. ఆయన మనసు పడిన పదబంధం అది. అది విప్లవ తత్వాన్ని సూచించే ఫిరంగిగుండు.” అంటూ శ్రీశ్రీపట్ల సోదరాభిమానంతో
“నీ పాటల కత్తులతోనే
నా హృదయం నెత్తురు తీసి
నే వెలిగించిన ఈ దీపపు కాంతిని
నర్తింపుముర శ్రీ శ్రీశ్రీ!”
అనగలిగిన శ్రీరంగం నారాయణబాబు రుధిరజ్యోతిలోని భావచిత్రాలను మనకు చూపిస్తున్నారు డా. పి.సంజీవమ్మ వ్యాసనేత్రంలో.

Leave a Reply